In IPL 2019 Acution Andhra Ranji Player Bandaru Ayyappa Selected by Delhi Capitals. He was From Rajolu in east godavari. And he already selected for 2018-19 Duleep Trophy India Blue squad
#IPL 2019
#AndhraRanjiPlayer
#Bandaru Ayyappa
#DelhiCapitals
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరో తెలుగు కుర్రాడు ఎంపికయ్యాడు. మంగళవారం జైపూర్ వేదికగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. కనీసధర రూ. 20 లక్షలకో వేలంలోకి వచ్చిన బండారు అయ్యప్పను అంతే ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన బండారు అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన అయ్యప్ప ఆంధ్ర తరుపున అండర్-16, అండర్-19 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.